బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసిన అనిల్ రావిపూడి...!!

murali krishna
అనిల్ రావిపూడి కామెడీ సినిమాలను ఎంతో అద్భుతంగా ప్రేక్షకులని అలరిస్తున్నాడు.డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఈయన మాటల రచయితగా పలు సినిమాలకు అయితే పని చేశారు. ఇలా మాటల రచయితగా ఇండస్ట్రీలో ఎంతో మంచే సక్సెస్ అందుకున్నటువంటి అనిల్ రావిపూడి ప్రస్తుతం డైరెక్టర్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారటా.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమా ద్వారా దర్శకుడుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఈయన డైరెక్షన్లో వస్తున్నటువంటి ప్రతి ఒక్క సినిమా ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్నాయి.తాజాగా f3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా మరో సినిమా చేయబోతున్నారటా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుందటా.అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో బాలయ్య అభిమానులు అనిల్ రావిపూడి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారని తెలుస్తుంది.. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే అనిల్ రావిపూడి మల్టీ టాలెంటెడ్ అని అయితే చెప్పవచ్చు ఈయన కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాకుండా మంచి డాన్సర్ అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన చాలా ఫన్నీగా చేసే వీడియోలు ఇంటర్వ్యూలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. అయితే తాజాగా అనిల్ రావిపూడి ఫైట్ మాస్టర్, డాన్స్ కొరియోగ్రాఫర్ తో కలిసి బాలయ్య పాటకు చిందులు వేశారటా.. నట్టు లూజు దానా బాలయ్య, బాలయ్య..ఫిట్టు చేయరానా’ అంటూ లారీ డ్రైవర్ సినిమాలోని పాటకు డ్యాన్సులు చేశారటా. ఇందులో ఇప్పటికే ఫైట్స్ ముగిసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ డాన్స్ వీడియో స్పందిస్తూ హీరోగా ట్రై చేయొచ్చు కదా అని అంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: