పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా టైటిల్ అందరూ అనుకున్నదే ఫిక్స్ చేసారుగా...!!

murali krishna
పవన్ కళ్యాణ్  సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం వినోదయ సిత్తం రీమేక్. సముద్రఖని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ తమిళ సినిమా ఫాంటసీ కామెడీ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చిందట..
అక్కడ మంచి విజయాన్ని అందుకోవడం తో ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారట.. తమిళంలో డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ రీమేక్ ని కూడా తెరకెక్కిస్తున్నాడట.. ఈ సినిమాలో పవన్ పాత్ర సగ భాగం మాత్రమే ఉంటుందట.. దీంతో పవన్ కి సంబంధించిన టాకీ పార్ట్ ని ముందుగా పూర్తి చేసేశారట..

ఇప్పుడు సాయి ధరమ్ మరియు ఇతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం #PKSDT వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయని తెలుస్తుంది.. ఈ మధ్య కాలంలో BRO అనే టైటిల్ గట్టిగా వినిపించింది. తాజాగా చిత్ర యూనిట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందరూ అనుకున్నట్టే చివరికి BRO టైటిల్‌నే ఫిక్స్ చేశారట.. ఇక ఈ మోషన్ పోస్టర్ కి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో అయితే ఉంది.
ఇక పోస్టర్ లోని పవన్ లుక్స్ అభిమానులకు మంచి కిక్ అయితే ఇచ్చింది. దీంతో సినిమా పై మరింత క్యూరియాసిటీ కూడా పెరిగింది. కాగా సముద్రఖని గతంలో తెలుగులో మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్టు అందుకోలేకపోయిన కానీ కథ పరంగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పవన్ సినిమాతో మరి ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటాడా అనేది చూడాలి. ఈ సినిమాని జులై 28న రిలీజ్ చేయబోతున్నారట.ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా అయితే నిర్మిస్తుంది. కేతిక శర్మ, ప్రియా వారియర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: