అన్నీ మంచి శకునములే.. సినిమా సక్సెస్ అయ్యిందా..!!

Divya
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా హీరోయిన్ మాళవిక నాయర్ నటిస్తున్న తాజా చిత్రం అన్ని మంచి శకునములే.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉన్నది. ఈ రోజున ఈ సినిమా థియేటర్లో చాలా ఘనంగా విడుదల అయింది స్వప్న మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో భారీగానే ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్ షోలు పడడం జరిగింది. తాజాగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సైతం రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

ఈ సినిమా బోరింగుగా స్లోగానే సాగుతూనే కొన్ని కామెడీ సీన్స్ లవ్ సీన్స్ బాగానే ఉన్నాయని ముఖ్యంగా 1990 సినిమాలో లవ్ ఎలా ఉంటుంది. అనే కదా అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడవచ్చని పలువురు సినీ ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. మరి కొంతమంది ఈ సినిమా చాలా చూడడానికి బాగుందని.. సెకండాఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని కామెడీ అండ్ ఎమోషనల్ వర్క్ బాగున్నాయని క్లైమాక్స్ అదిరిపోయేలా ఉందంటూ పలువురు నేటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు. డైరెక్టర్ వరకు కూడా బాగానే ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.
 
ఈ సినిమా సరికొత్త కథాంశంతో తెరకెక్కించడం జరిగింది ఈ సినిమాకి మంచి స్కోప్ ఉందని సంతోష్ మాలవికాతో పాటు ఇతర పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉందని తెలియజేస్తున్నారు చిత్రబృందం. ఇందులోని పాత్రలన్నీ కూడా కథలు చాలా ఇంపాక్ట్ చూపిస్తాయని తెలియజేస్తున్నారు... ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. అసలు ఇలాంటి కథలకు చాలా పాత్రలు ఉండడం వారికి తగ్గ న్యాయం చేయడం అనేది ఒక గొప్ప చాలెంజ్ గా ఉంటుంది అని తెలియజేస్తోంది నందిని రెడ్డి. ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఇందులో చాలా కీలకంగానే ఉంటుందని తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: