24 గంటల్లో నిఖిల్ "స్పై" మూవీ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న యువ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో నిఖిల్ ఒకరు. ఈ నటుడు హ్యాపీ డేస్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అనేక సినిమాలలో హీరోగా నటించిన నిఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కల నటుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. పోయిన సంవత్సరం ఈ యువ నటుడు కార్తికేయ 2 ... 18 పేజెస్ అనే రెండు సినిమాల్లో హీరోగా నటించాడు.

ఇందులో కార్తికేయ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించగా ... 18 పేజెస్ మూవీ యావరేజ్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల్లో కూడా నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం నిఖిల్ "స్పై" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. గరి బి హెచ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ ... నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని జూన్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా టీజర్ కు 24 గంటల్లో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.  స్పై మూవీ టీజర్ కు 24 గంటల సమయంలో 9.72 మిలియన్ వ్యూస్ , 133.5 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇప్పటికే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న నిఖిల్ ఈ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: