మళ్లీ ఆ స్టార్ హీరో దే మొదటి స్థానం..!!

Divya
ప్రతినెల ORMAX సంస్థ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల పొజిషన్లో గురించి తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉండే ఎక్కువగా ఎవరి పేరు వినిపిస్తూ ఉంటుందో దాని ద్వారా టాప్ హీరోలలో ఎవరు మొదటి స్థానం ఉంటారు అనే విషయాన్నిలను తెలియజేస్తూ ఉంటుంది. ఈనెల కూడా ఒర్మాక్స్ సంస్థ టాప్ 10 హీరోల లిస్టులను విడుదల చేయడం జరిగింది. మరి ఈసారి ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు తెలుసుకుందాం.

టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అతని సినిమా బడ్జెట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు దాదాపుగా రూ .2000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రభాస్ సినిమాలు ప్రస్తుతం తెరకెక్కిస్తూ ఉన్నారు దర్శకనిర్మాతలు  ఇక అదే స్థాయిలోనే బిజినెస్ కూడా జరుగుతూ ఉండడం జరుగుతోంది.తాజాగా ఓర్మాక్స్ సర్వేలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం . ప్రభాస్ చేస్తున్న సినిమాలు సోషల్ మీడియాలో ఎక్కువగా పేర్లు వినిపించడం వల్ల ఈసారి ప్రభాస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక రెండవ స్థానంలో రామ్ చరణ్ ఉండగా మూడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండగా నాలుగవ స్థానంలో అల్లు అర్జున్ రావడం జరిగింది.

ఐదవ స్థానంలో మహేష్ బాబు ఉండగా ఈసారి ఆరవ స్థానంలో నేచురల్ స్టార్ నాని ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈసారి ఏడవ స్థానంలో నిలిచారు ఇక వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి ఎనిమిదవ స్థానంలో ఉండగా విజయ్ దేవరకొండ తొమ్మిదవ స్థానంలో నిలిచారు. ఎప్పటిలాగే రవితేజ ఈసారి పదవ స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఇవన్నీ కేవలం ప్రతినెల స్థానాలు సైతం మారుతూ ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల పాపులారిటీని బట్టి ఓర్మ్యాక్ సంస్థ  ప్రతినెల ఇండియన్ తెలుగు మూవీ హీరోల పాపులర్ లిస్టును విడుదల చేస్తూ ఉంటుంది. మరి వచ్చే నెలలో ఏ హీరో మొదటి స్థానంలో నిలుస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: