నిహారిక పై మండిపడుతున్న నేటిజన్లు...!!

murali krishna
తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు నిహారిక కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది ఈ బ్యూటి. మొదటగా యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక తర్వాత హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆమె నటన బాగున్నప్పటికీ సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు కొంత కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా నిహారిక అన్న మాటలపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. పంచులు, ప్రాసలు: మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా పరిచయమైన ఏకైక ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా 'ఢీ' అనే డ్యాన్స్ షోతో యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన మాటలతో మెప్పించిన ఈ బ్యూటి ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అప్పుడప్పుడు పలు షోలలో అతిథిగా వచ్చి పంచులు, ప్రాసలతో కామెడీ చేసిన ఆకట్టుకుంది.
కెరీర్ పరంగా: కొన్ని రోజులకు 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించడంతో పాటు నటించింది నిహారిక కొణిదెల. అలా కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకుంది. ఇక 2016లో వచ్చిన 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై తెరంగేట్రం చేసిన నిహారిక కొణిదెలకు కెరీర్ పరంగా వర్కౌట్ కాలేదు.
చైతన్యతో పెళ్లి: తొలి సినిమా ఒక మనసు ప్లాప్ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాలు చేసింది నిహారిక కొణిదెల. కానీ, ఇవి కూడా ఆమెకు అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. నిహారిక కొణిదెల హీరోయిన్ గా చివరిగా ఓ మంచి రోజు చూసి చెప్తా అనే సినిమాలో నటించింది. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది.
Mega Daughter niharika konidela Got Trolled For Dead Pixels Web Series Dialogue
మే 19 నుంచి: అయితే ఈ మధ్య నిహారిక, చైతన్య విడిపోయారనే వార్తలు తెగ వస్తున్న విషయం తెలిసిందే. వాటిపై ఎలాంటి క్లారిటీ రాలేదు గానీ, నిహారిక మాత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ తో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. నిహారిక తాజాగా నటించిన వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెటిజన్ల ట్రోలింగ్: తాజాగా డెడ్ పిక్సెల్స్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో ఐదుగురు యువతీయువకులు బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్ అనే గేమ్ ఆడినట్లుగా చూపించారు. ఇందులో గాయత్రిగా కనిపించిన నిహారిక ఇద్దరిని ఇష్టపడుతున్నట్లుగా చూపించారు. "బాగా ఆలోచించాను ఐషు.. రోషన్ ఇన్ బెడ్.. భార్గవ్ ఇన్ ద హెడ్" అనే డైలాగ్ చెప్పింది. నిహారిక అలా డైలాగ్ చెప్పడంతో నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.మెగా డాటర్ కదా: 'ఇలాంటి చిల్లర వెబ్ సిరీస్ తీసి సోసైటీని ఇంకా చెడగొట్టకండి', 'నిహారిక అంతా గేమర్ వి.. నీకు ఎందుకు పెళ్లి', 'సినిమాలో స్టఫ్ లేదు, జీవితంపై కాన్సంట్రేట్ చేయు.. ఎందుకంటే నువ్వు మెగా ఫ్యామిలీ కూతురివి కాబట్టి', 'డిస్ లైక్ డిస్ లైక్ నిహారిక కొణిదెల', 'మోసగాళ్లు, నా ఫ్రెండ్ నుంచి స్క్రిప్ట్ లేపేశారు', 'నిహారిక ఉంది ఇంకేం చూస్తాం వేస్ట్' అంటూ పలువురు విమర్శిస్తుంటే.. మరికొంతమంది బాగుందని మెచ్చుకుంటున్నారు.
బానిసలుగా మారి: ఇదిలా ఉంటే డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీసులో నిహారిక కొణిదెలతోపాటు హీరో సాయి రోనాక్, వైవా హర్ష, అక్షయ్ లాగుసాని, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ తదితరులు నటించారు. ఈ సిరీసుకు సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందించారు. అయితే డెడ్ పిక్సెల్ సిరీసులో గేమ్స్ కి బానిసలుగా మారి కుటుంబాన్ని కూడా పట్టించుకోని యువత కథాంశంగా తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: