వెరైటీ కాంబో.. మాస్ కామెడీ పక్కా..!
రావణాసుర సినిమాతో మరోసారి నిరాశపరచిన రవితేజ ఈసారి అనుదీప్ తో కామెడీ ఎక్స్ ప్రెస్ లాంటి సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఈగల్ అంటూ మరో సినిమా లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాల తర్వాత అనుదీప్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
రవితేజ కి మాస్ పల్స్ బాగా తెలుసు.. ఆయన కామెడీ టైమింగ్ కి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. అనుదీప్ కనుక ఈ రెండిటినీ పట్టేస్తే మాత్రం ఈ కాంబోలో నెవర్ బిఫోర్ సూపర్ హిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమా గురించి రవితేజ చాలా ఆస్క్తిగా ఉన్నారని తెలుస్తుంది. ప్రిన్స్ సినిమా ఫెయిల్ అవడంతో అనుదీప్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. రవితేజ ఎనర్జీకి సూటయ్యే కథ సెట్ అయితే మాత్రం మరోసారి బాక్సాఫీస్ దగ్గర జింతాక్ జింతాక్ ఆడేయడం పక్కా అని చెప్పొచ్చు. రవితేజ ఈమధ్య తన సినిమాల ప్లానింగ్ విషయంలో క్రేజీగా ఉంటున్నారు. సరైన కథల కోసం వెతుకుతున్న ఆయనకు అనుదీప్ చెప్పిన పాయింట్ నచ్చడంతో ఓకే అనేశారట. అయితే తాను చెప్పిన లైన్ ఓకే అంటారని అనుదీప్ ఊహించలేదట. అయితే ఫుల్ స్క్రిప్ట్ మాత్రం కొద్దిగా టైం పడుతుందని తెలుస్తుంది. ఈలోగా మాస్ రాజా తను కమిటైన సినిమాలన్నీ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.