ప్రియాంకా నిక్.. ఈ విషయం మీకు తెలుసా..!

shami
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు పూర్తిస్థాయిలో హాలీవుడ్ హీరోయిన్ అయిపోయింది. అక్కడ వరుస సీరీస్ లు సినిమాలతో అమ్మడి కెరీర్ ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది. సినిమాలు సీరీస్ లతో పాటుగా తను చేసే స్టేట్మెంట్స్ తో కూడా వార్తల్లో నిలుస్తుంది ప్రియాంక. లేటెస్ట్ గా తన భర్త నిక్ నోనస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అందాల భామ ప్రియాంక చోప్ర మిస్ వరల్డ్ అయిన విషయం తెలిసిందే.
2000 లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది అమ్మడు. అయితే తను మిస్ వరల్డ్ అయినప్పుడు తన భర్త ఏజ్ కేవలం ఏడేళ్లే అని షాక్ ఇచ్చింది ప్రియాంక. హస్బండ్ ఏజ్ గురించి చెప్పి సర్ ప్రైజ్ చేసింది అమ్మడు. తనకు మిస్ వరల్డ్ వచ్చిన టైం లో నిక్ ఇంకా చిన్న పిల్లాడు అన్నట్టుగా చెప్పింది. అయితేనేం ఆ తర్వాత అతనొక ఫేమస్ పాప్ సింగర్ అవబట్టే కదా అమ్మడు అతన్ని పెళ్లాడింది అని అంటున్నారు. నిక్ తో తమ మ్యారేజ్ రిలేషన్ చాలా బాగుందని అంటున్న ప్రియాంక పెళ్లికి ముందు సెక్స్ గురించి కూడా బోల్డ్ స్టేట్మెంట్స్ చేస్తుంది.
తనకు చాలామంది బోయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఒప్పేసుకున్న అమ్మడు తన మార్క్ కామెంట్స్ తో సర్ ప్రైజ్ చేస్తుంది. క్వాంటికో సీరీస్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అప్పటి నుంచి తిరిగి చూసుకున్నది లేదు. ఓ పక్క ప్రొఫెషనల్ లైఫ్.. మరోపక్క పర్సనల్ లైఫ్ రెండిటినీ సూపర్ గా బ్యాలన్స్ చేస్తూ సత్తా చాటుతుంది అమ్మడు. హాలీవుడ్ వెళ్లాక ఇండియా నుంచి ఆఫర్లు వచ్చినా కూడా చేయని అమ్మడు ఇక్కడ ఎక్స్ పీరియన్స్ లను మాత్రం చెబుతూ వస్తుంది. అక్కడ ప్రియాంక ఫాం ని చూసి మిగతా వారు షాక్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: