యానిమల్ ప్లానింగ్ ఆ రేంజ్ లోనా..?

shami
అర్జున్ రెడ్డి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో చూపించిన సందీప్ వంగ ఆ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసి వారెవా అనిపించాడు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో యానిమల్ అంటూ మరో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడు సందీప్ వంగ. ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. లేటెస్ట్ గా యానిమల్ నుంచి వచ్చిన న్యూస్ తో ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా లో రణ్ బీర్ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తారట. ఈ మూడు పాత్రల్లో రణ్ బీర్ అదరగొట్టేస్తారని అంటున్నారు.
అసలే అర్జున్ రెడ్డి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన సందీప్ వంగ యానిమల్ లో రణ్ బీర్ ని ఎలా చూపించబోతున్నాడు అన్న ఆసక్తి మొదలైంది. ఇక ఆమధ్య వచ్చిన పోస్టర్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయి. లేటెస్ట్ గా యానిమల్ లో రణ్ బీర్ 3 డిఫరెంట్ రోల్స్ అనగానే అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఏది ఏమైనా కమింగ్ డేస్ లో టాలీవుడ్ ని షేక్ చేసే డైరెక్టర్స్ లిస్ట్ లో సందీప్ వంగ కూడా ఉంటాడని చెప్పొచ్చు. సందీప్ వంగ ప్లానింగ్ కూడా అదే రేంజ్ లో ఉంది.
యానిమల్ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమా ఫిక్స్ చేసుకున్న సందీప్ వంగ ఆ సినిమాను కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నాడని టాక్. స్పిరిట్ ని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించే ఆలోచన తో ఉన్నాడట. సందీప్ వంగ మ్యాడ్ నెస్ ఏంటో రాబోయే సినిమాలతో మరింత అర్ధమవుతుంది. స్పిరిట్ తర్వాత అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు సందీప్. మొత్తానికి మనోడి సినిమాల లైనప్ మాత్రం అదిరిపోయింది. ఇక సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: