ఆ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న విజయ్ దేవరకొండ... ఆ సినిమా గాని చేసుంటే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. కానీ ఆ పాత్రల ద్వారా ఈ నటుడు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఆ తర్వాత పెళ్లి చూపులు మూవీ లో హీరో గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు మూవీ లోని తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ నటుడు ఆ తర్వాత అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీవాలా మూవీ విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరో గా మారిపోయాడు.

ఆఖరుగా విజయ్ ... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్ "ఖుషి" అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన విజయ్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ కూడా చేశాడు.

అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. అలా విజయ్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో ఈస్మార్ట్ శంకర్ మూవీ ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినెని హీరోగా రూపొందిన ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథను మొదట పూరి జగన్నాథ్ ... విజయ్ కే వినిపించగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కథను విజయ్ రిజెక్ట్ చేయగా ఆ తర్వాత ఇదే కథను రామ్ తో పూరి జగన్నాథ్ తెరకెక్కించగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: