హిందీ ఛత్రపతి సినిమా ఆకట్టుకుంటుందా...?

murali krishna
రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి... ఈ సినిమా తెలుగులో సూపర్ డుపర్ హిట్ అయింది.ఈ సినిమా వల్ల ప్రభాస్ తెలుగు లో స్టార్ హీరో గా మారాడు..
 ఈ సినిమాని ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ లో రీమేక్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా ట్రెయిలర్ కూడా విడుదల అయింది.దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందట.. అయితే ఈ సినిమా ను తెలుగులో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వి వి వినాయక్ డైరెక్షన్ చేస్తున్నాడని తెలుస్తుంది....అయితే ఒరిజినల్ ఛత్రపతి సినిమాని తెరకెక్కించిన రాజమౌళి స్థాయి లో వినాయక్ ఈ సినిమా ని తీసాడా లేదా అనేది తెలియాలి అంటే మరీ కొద్ది గంటలు వేచి చూడాలి... అయితే తెలుగులో ఎంతో పెద్ద హిట్ అయిన ఈ సినిమాని తెలుగు నుంచే మరో హీరో అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో చేయడం నిజంగా సాహసమనే చెప్పవచ్చు.
ఇక ట్రైలర్ వచ్చాక  మంచి అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రం రన్ టైం ఇప్పుడు బయటికి వచ్చిందని తెలుస్తుంది.. అయితే హిందీలో ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రాన్ని చాలా వరకు తగ్గించారు అని సమాచారం.. హిందీలో ఈ సినిమా కేవలం 123 నిమిషాల 47 సెకండ్స్ మాత్రమే వచ్చిందని తెలుస్తుంది.
అంటే కేవలం రెండు గంటల సినిమాగా మాత్రమే ఇది ఉంటుంది అని చెప్పవచ్చు. దీనితో ఒరిజినల్ లో చాలా సీన్స్ ఈ సినిమాలో లేనట్టే అని తెలుస్తుంది.. అయితే ఇప్పటికే ఒరిజినల్ ఛత్రపతి సినిమాలో ఉన్న చాలా సీన్స్ ని ఈ సినిమాలో నుంచి తీసేశారు అని వస్తున్న వార్తలకు ఈ రన్ టైమ్ వల్ల ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఒరిజినల్ లో ఉన్న కీలక మైన సీన్స్ ని  ఈ సినిమాలో నుంచి తీసివేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు డైరెక్టర్ వినాయక్ ఇద్దరు కూడా చాలా విమర్శలు ఎదురుకొక తప్పదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: