బాలయ్య కోసం 100 కోట్లు వదులుకున్న స్టార్ హీరో..!?

Anilkumar
నందమూరి నటసింహం బాలకృష్ణకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ సినిమాలలో ఈయన నటనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే స్టార్ హీరోకి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమా హిట్ అయింది అంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ షేక్ అవుతాయి. ఇక ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో అంటే కేవలం ప్రేక్షకుల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్ లో సైతం బాలయ్య కి మంచి క్రేజ్ ఉంది. యువ హీరోలు ఈయనతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించే అవకాశం వస్తే చాలు అన్నట్లుగా ఉంటారు. 

అయితే ఇండియాలోనే ఒక బడా సూపర్ స్టార్ బాలకృష్ణ సినిమాలో నటించేందుకు తనకు వచ్చిన 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ ని కూడా పక్కన పెట్టాడట. బాలయ్యతో నటించడానికి ముందుకు వచ్చినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .అయితే ఆ సూపర్ స్టార్ మరి ఎవరో కాదు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. ప్రస్తుతం బాలయ్య మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యకి విలన్ గా అక్షయ్ కుమార్ నటించిన బోతున్నట్లుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి అక్షయ్ కుమార్ ని వెళ్లి ఈ సినిమాలో ఆయనకి విలన్ గా నటించమని చెప్పడంతో ఆయన ఎంతో సంతోషించాడట.

బాలీవుడ్ లో స్టార్ గా కొనసాగుతున్న ఈయన బాలయ్య కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఇక అలాంటి ఒక బడా స్టార్ హీరో బాలయ్య సినిమాలో చేయమని అడగగానే వెంటనే ఒప్పుకున్నాడట. ఇక అందుకు కారణం ఆయనకి బాలయ్య మీద ఉన్న అభిమానమే. అయితే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇలాగే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అలాగే ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా బాలకృష్ణ సినిమాలో ఒక రూపాయి రెమ్యూనికేషన్ కూడా తీసుకోకుండా ఈ సినిమా కోసం ఆయన బాలీవుడ్లో 100 కోట్ల పారితోషకం ఇచ్చే సినిమాని కూడా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: