మేము కావాలి అనుకుంటే ఏ డైరెక్టర్ తో అయినా మా నాన్న మూవీ సెట్ చేస్తాడు... చైతూ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి తమిళ దర్శకుడు అయినటు వంటి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి కృతి శెట్టి ఈ సినిమాలో చైతూ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ... అరవింద స్వామి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ప్రియమణి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాను తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందించారు.

అదే విధంగా ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో రేపు అనగా మే 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ యూనిట్ ఇప్పటికే ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ యొక్క ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ఇటు తెలుగు సినీ ప్రేమికులు ... అటు తమిళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల సందర్భంగా నాగ చైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.


 ఆ ఇంటర్వ్యూలో భాగంగా చైతూ ... నాగార్జున గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా చైతు మాట్లాడుతూ ... నేను కానీ అఖిల్ కానీ ఇప్పటికిప్పుడు నాన్న ఈ డైరెక్టర్ తో నాకు పని చేయాలని ఉంది అని చెప్తే కారు ఎక్కి ఆ డైరెక్టర్ ఆఫీస్ కి వెళ్లి ప్రాజెక్ట్ సెట్ చేస్తాడు. మీకు ఏ డైరెక్టర్ కావాలో అడగండ్రా అడ్వాన్స్ పంపిస్తాను అని చాలా సార్లు అడిగాడు. అందులో నాన్న తప్పు ఏమీ లేదు. మేము వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్ గా ఎదగాలని అనుకుంటున్నాము అని నాగ చైతన్య ... నాగార్జున గురించి తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: