24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు .. నటి వాసుకి..!!

Divya
పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి వాసుకి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సోదరి పాత్రలో నటించింది ఈ తమిళ నటి. ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు అయితే లభించింది. దీంతో పలు బుల్లితెరపై సీరియల్స్ లో కూడా నటించి బాగానే ఫేమస్ అయ్యింది వాసుకి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయిని వివాహం చేసుకొని ఈమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. అయితే నటిగా మాత్రం పెద్దగా కెరియర్ ని ముందుకు సాగలేదు. తొలిప్రేమ సినిమా తర్వాత ఈమెకు అవకాశాలు వచ్చిన నటించలేదట.
దాదాపుగా 24 సంవత్సరాల తర్వాత మళ్లీ అన్ని మంచుశకునములే చిత్రం ద్వారా కమ్ బ్యాక్ ఇవ్వబోతోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో వాసుకి తన సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని కూడా తెలియజేయడం జరిగింది. తొలిప్రేమ సినిమా తర్వాత అవకాశాలు చాలానే వచ్చాయి. కానీ అవి చేయడం కుదరలేదు.. కేవలం కుటుంబం పిల్లలతోనే ఇన్ని రోజులు ఎక్కువగా సమయాన్ని గడిపాను. తన తమ పిల్లలు కూడా ఇప్పుడు విదేశాలలో చదువుతున్నారు తన భర్త కూడా తన లైఫ్ లో బిజీగా ఉన్నారని తనకు కూడా ఏదైనా చేయాలనిపించిందని అందుకే మళ్ళీ యాక్టింగ్ వైపుగా వస్తున్నాను అంటూ తెలియజేసింది వాసుకి.
ఈమె సినిమాలతో పాటు సైకాలజీలో పీహెచ్డీ కూడా చేస్తున్నానంటూ తెలిపింది. తను నటిస్తున్న ఈ చిత్రంలో సోదరి పాత్రలు కనిపించబోతున్నానని కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నానని తెలిపింది. తన భర్త ఆనంద్ వల్ల ఇంట్లో ప్రతిరోజు సినిమా చర్చలు జరుగుతూనే ఉంటాయని నటననే కాదు ఇలాంటి విషయాన్నీ అయినా సరే సీరియస్గా తీసుకొను.. ఏ పాత్ర చేసిన తానులో తన మార్కు ఉండేలా చూసుకుంటానని తెలిపింది వాసుకి. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: