ఎన్టీఆర్ పుట్టినరోజున ఎన్టీఆర్ 30 నుండి ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం చెందడంతో ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్న శివ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చాలా రోజులను కేటాయించాడు. అందులో భాగంగా ఈ సినిమా కథ మొత్తం అద్భుతంగా వచ్చింది అన్న తర్వాతనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. అలాగే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా పని చేస్తూ ఉండగా ... అనేక మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యొక్క టైటిల్ ను విడుదల చేయనున్నట్లు ... అలాగే ఒక పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: