ఛత్రపతి సినిమా నాకెప్పుడూ ప్రత్యేకమే : రాజమౌళి

murali krishna
తెలుగులో బంపర్ హిట్‌ సాధించిన సినిమా 'ఛత్రపతి'. ఈ చిత్రాన్ని హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ హిందీలో రీమేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే.
వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదలకానుందని సమాచారం.. ప్రస్తుతం ఈ చిత్ర బృందమంతా ప్రచార కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్‌ వివిధ ఛానల్స్‌లో ఇంటర్వ్యూల్లో సినిమా విశేషాలు పంచుకుంటూ ఆసక్తి ని కలిగిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్‌కు దర్శక ధీరుడు రాజమౌళి విషెస్‌ కూడా తెలిపారు.
ప్రత్యేక వీడియో ద్వారా ఆయన 'ఛత్రపతి' మూవీ టీమ్‌ను ఆయన అభినందించారు. ''ఛత్రపతి' సినిమా నాకెప్పుడూ  కూడా ప్రత్యేకమైనదే. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మాస్‌ దర్శకుల్లో వినాయక్‌ కూడా ఒకరు. ఆయన ఈ సినిమాను రీమేక్‌ చేస్తున్నారని తెలిసి నేను చాలా సంతోషించాను. బెల్లంకొండ శ్రీనివాస్‌ మంచి ప్రేక్షకాదరణ ఉన్న నటుడు. తనకు 'ఛత్రపతి' స్టోరీ కచ్చితంగా బాగా సరిపోతుంది'' అని అభినందించారు. ఈ సినిమాను థియేటర్లో చూడాలని కూడా ఆయన కోరారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరలవుతోంది. ఇక రాజమౌళికి బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు ఆ చిత్ర బృందమంతా కూడా కృతజ్ఞతలు తెలిపింది.
తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో వినాయక్‌ ఆయన గురించి మాట్లాడారు. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్‌ హిందీలోనూ పెద్ద స్టార్‌ హీరోగా ఎదుగుతారని అన్నారు. ఇంతమంచి కథను అందించినందుకు రచయిత విజయేంద్రప్రసాద్‌కు ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారు. రాజమౌళి మరియు ప్రభాస్‌ కలిసి చేసిన ఈ సినిమాను మేము జాగ్రత్తగా రీమేక్‌ చేశామని చెప్పారు. అందులోని ఐకానిక్‌ సన్నివేశాలను అస్సలు మార్చలేదని చెప్పుకొచ్చారు.అందులో వున్నా మాస్ డైలాగ్స్ కూడా అందరిని బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాతో బెల్లంకొండ సాయి మాస్ హీరోగా మంచి పేరు సంపాదిస్తాడు. ఈ సినిమా భారీ గా రిలీజ్ కాబోతుంది. భారీ కలెక్షన్స్ కూడా సాధిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: