అఫీషియల్ : ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్న పవన్ ఈ మధ్య కాలంలో వరుస మూవీ లకు కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే.

అందులో భాగంగా ప్రస్తుతం పవన్ ... హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే గతంలో పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. గబ్బర్ సింగ్ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.  

ఈ మూవీ విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఇకపోతే ప్రస్తుతం పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో ఇప్పటికే మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను ప్రముఖ సంస్థ కొనుగోలు చేసింది. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: