శ్రీలీల తో హీరోలకు తిప్పలు ?

Seetha Sailaja
క్రేజీ బ్యూటీ శ్రీలీల ఇప్పటివరకు నటించిన సినిమాలు రెండు మాత్రమే. అందులో ఆమె మొదటి సినిమా ‘పెళ్ళి సందడి’ ఫెయిల్ అయితే రెండవ సినిమా ‘ధమాక’ మాత్రమే సక్సస్ అయింది. అయితే ఆమె మ్యానియా తారా స్థాయికి చేరిపోవడంతో టాప్ హీరోలు అంతా ఆమెనే కోరుకుంటున్నారు. పూజా హెగ్డే కు ఐరన్ లెగ్ స్టాంప్ పడటం అదే కోవలో రష్మిక కూడ కొనసాగుతూ ఉండటంతో చాల మంది దర్శకులు నిర్మాతలు శ్రీలీల భజన చేస్తున్నారు.

దీనికితోడు ఆమె వచ్చిన అవకాశాలు అన్నీ వరసపెట్టి ఒప్పుకోవడంతో పాటు ఆమె తన  డేట్స్ మేనేజ్మెంట్ పై కంట్రోల్ తప్పడంతో ఆమె ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలు అన్నింటికీ న్యాయం చేయలేకపోతోంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె 9సినిమాలలో నటిస్తోంది. మహేష్ పవన్ రామ్ బాలకృష్ణ విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి ఇలా టాప్ యంగ్ హీరోల నుండి యంగ్ హీరోల సినిమాల వరకు నటిస్తూ ఉండటంతో ఆమె డేట్స్ కుదరక షూటింగ్ లు ఆగిపోతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి.

దీనితో ఆమెతో సినిమాలు చేస్తున్న హీరోలకు దర్శక నిర్మాతలకు సమస్యలు ఏర్పడుతున్నట్లు టాక్. బాలకృష్ణ అనీల్ రావిపూడి ల మూవీని ఈ సంవత్సరం దసరా కు విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే కీలక సన్నివేశాలకు సంబంధించి శ్రీలీల డేట్స్ సమస్యగా మారడంతో ఈమూవీ దసరా కు విడుదల అవుతుందా అన్న సందేహాలు కొందరు వ్యక్తపరుస్తున్నారు. ఇక బోయపాటి రామ్ ల కాంబినేషన్ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు సంబంధించి కూడ ఇదే సమస్య అని అంటున్నారు.

మహేష్ తో శ్రీలీల నటిస్తున్న త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీకి కూడ డేట్స్ సమస్య వచ్చింది అని అంటున్నారు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ చాల నెమ్మదిగా కొనసాగుతోంది. ఇది చాలదు అన్నట్లుగా విజయ్ దేవరకొండ తో మరొక కొత్త సినిమాను ఒప్పుకుంది. ఇన్ని సినిమాలకు శ్రీలీల అనుకున్న విధంగా డేట్స్ సరిపెట్టగలదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: