సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల ప్రొఫెషనల్ జీవితంతో పాటు పర్సనల్ విషయాలను కూడా తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు సినీ ప్రేక్షకులు. ఈ నేపథ్యంలోనే తారల లవ్, డేటింగ్ ,పెళ్లి విడాకులు వంటి విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఇద్దరు సెలబ్రిటీలు కలిసి బయటకు వస్తే చాలు వారిద్దరి మధ్య ఉన్నది స్నేహమా ప్రేమ అన్న కోణంలో ఆలోచిస్తారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే ఈ కాకిని నాగచైతన్య శోభిత దూళిపాల డేటింగ్ రూమర్స్ ఎప్పటినుండో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఒకసారి లండన్ వెకేషన్ లో మరోసారి రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి జంటగా కనిపించారు.
దీంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని వారిద్దరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. అయితే సమంతతో విడాకులు అయిన తర్వాత నాగచైతన్య శోభితతో ప్రేమలో ఉన్నాడని అందుకే వారిద్దరూ చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు అని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రూమర్లపై స్పందించింది శోభిత దూళిపాల. నేను మంచి సినిమాలో చేస్తున్నాను డైరెక్షన్లో ఇటీవల పోనియన్ సెల్వన్ సినిమాలో నటించాను. ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ పాటకు డాన్స్ చేయడం ఎంతో అద్భుతంగా అనిపించింది. ఇంత మంచి మధుర జ్ఞాపకాలు ఉన్నప్పుడు ఎవరో ఏదో అంటున్నారు అని నేను అసలు పట్టించుకోను. వాటి గురించి అసలు ఆలోచించను కూడా.
ఆ రూమర్ తో నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. నేను ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరమేముంది.నా పని నేను చేసుకుంటూ పోతాను అంటూ క్లారిటీ ఇచ్చింది శోభిత దూళిపాల. దీంతో శోభిత ధూళిపాల చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ సంబంధించిన డేటింగ్ రూమర్ ఎప్పటినుండో వస్తున్నాయి. అయినప్పటికీ ఇంత కాలంగా వీరిద్దరికీ సంబంధించిన రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ శోభితా కానీ అటు నాగ చైతన్య కానీ ఎప్పుడూ స్పందించింది లేదు. దీంతో ఇంత కాలానికి మొదటిసారిగా శోభిత ఈ వ్యవహారంపై స్పందించడంతో ఈ వార్త కాస్త ఆటోగ్గా మారింది..!!