ఈరోజు తెలుగు క్రేజీ మూవీల షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న కొంత మంది హీరోల సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. ఆ సినిమాలు ఏవి ... వాటి షూటింగ్ ఎక్కడ జరుగుతున్నాయో వాటి వివరాలను తెలుసుకుందాం.

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో 108 వ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ లో అర్జున్ రాం పాల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని కోటి లో జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న అర్జున్ రాం పాల్ పై ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ రామ్ చరణ్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రకరిస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూణే పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ పవన్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ , సుశాంత్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్కతా నగరంలో జరుగుతుంది. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం చిరంజీవి పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: