అప్పటినుండి స్టార్ట్ కానున్న "వార్ 2" మూవీ షూటింగ్... స్పెషల్ కసరత్తు చేయనున్న ఎన్టీఆర్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటువంటి "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ కు గ్లోబల్ గా సూపర్ క్రేజ్ కూడా లభించింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ ... కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది... ఈ  సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో ఎంతో మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ సూపర్ హిట్ విజయం సాధించినటువంటి వార్ మూవీ కి సీక్వల్ గా రూపొందబోతున్న వార్ 2 మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా హీరో గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన బాడీ మేకవర్ ను చేంజ్ చేసుకోవడానికి కసరత్తులను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: