తనకు బ్లాక్ బాస్టర్ ఇచ్చిన బ్యానర్లో మరో మూవీ చేయబోతున్న చైతూ..!

Pulgam Srinivas
అక్కినేని నాగ చైతన్య తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందినటువంటి కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృతి శెట్టి ... చైతు సరసన హీరోయిన్ గా నటించగా ... ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతం అందించారు. అరవింద స్వామి , ప్రియమణి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. మే 12 వ తేదీన ఈ మూవీ ని తెలుగు , తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల దగ్గర పడినప్పటికీ ఇప్పటి వరకు చైతు తన తదుపరి మూవీ కి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చైతు తన తదుపరి మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే గీత ఆర్ట్స్ బ్యానర్లో చైతు 100% లవ్ అనే సినిమాలో హీరో గా నటించాడు.

మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఈ మూవీ ద్వారా చైతు క్రేజ్ కూడా చాలా బాగా పెరిగింది. అలా తనకు 100% లవ్ తో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిన బ్యానర్ లో చైతు మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: