ఆ మూవీ పైనే ఆశలన్నీ పెట్టుకున్న అక్కినేని అభిమానులు..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన ఇమేజ్ కలిగిన ఫ్యామిలీ లలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు కాలం నుండి అక్కినేని అఖిల్ వరకు వీరి కుటుంబంలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. అలాగే ఆ హీరోలకు జనాల్లో కూడా అద్భుతమైన గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో అక్కినేని హీరోలకు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయాలు దక్కడం లేదు.

పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి బంగార్రాజు మూవీ తో అక్కినేని ఫ్యామిలీ కి అద్భుతమైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది. ఈ మూవీ లో నాగార్జున హీరో గా నటించగా ... నాగ చైతన్య ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఆ తర్వాత నాగ చైతన్య "థాంక్యూ" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. లాల్ సింగ్ చడ్డ అనే హిందీ మూవీ లో చైతు ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను అలరించ లేక పోయింది.

ఇది ఇలా ఉంటే అక్కినేని నాగార్జున పోయిన సంవత్సరం దసరా కానుకగా విడుదల అయినటువంటి ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా అఖిల్ "ఏజెంట్" అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల మూవీ కూడా ప్రేక్షకులను ఆలరించలేకపోయింది. తాజాగా నాగ చైతన్య "కస్టడీ" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా మే 12 వ తేదీన తెలుగు , తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: