NBK111 నుండి నయన్ అవుట్..స్టార్ బ్యూటి ఇన్..!? బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!

Thota Jaya Madhuri
నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ సినిమాలకు పెట్టింది పేరైన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఎన్.బి.కె 111’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవం నుంచే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇంతకుముందు బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచి, మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ విజయంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌పై మరింత నమ్మకం పెరిగింది. ఇప్పుడు వస్తున్న ‘ఎన్.బి.కె 111’ కూడా అంతకుమించిన స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుండగా, కథలో పవర్‌ఫుల్ ఎమోషన్లు, భారీ యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉండబోతున్నాయట. ముఖ్యంగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతుండటం ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్క్రిప్ట్ దశ నుంచే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాను అత్యంత గ్రాండ్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నాడట. అందుకే కథ, పాత్రలు, సన్నివేశాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్‌పై మళ్లీ వర్క్ చేస్తున్నారని సమాచారం.భారీ బడ్జెట్ కారణంగా నిర్మాతలు కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఖర్చులు నియంత్రణలో ఉండేలా అన్ని విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాస్టింగ్ విషయంలోనూ పునరాలోచన జరుగుతున్నట్టు టాక్.

ప్రస్తుతం ఈ సినిమాకు హీరోయిన్‌గా నయనతార ఫిక్స్ అయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ నుంచి నయనతార తప్పుకునే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కారణం ఏమిటంటే… ఈ సినిమా కోసం నయనతార ఏకంగా రూ.8 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే సినిమా బడ్జెట్ భారీగా ఉండటంతో, హీరోయిన్ పారితోషికం వల్ల ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారట.నయనతార స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకుంటే దాదాపు రూ.6 కోట్ల వరకు బడ్జెట్ సేవ్ అవుతుందని నిర్మాతలు లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నయన్ ప్లేస్ ని రీప్లేస్ చేసే సత్త ఒక్క త్రిష కే ఉంది అంటూ మేకర్స్ ఆమెని ఫైనలైజ్ చేశారట.  అయితే ఇప్పటివరకు ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇక బాలకృష్ణ అభిమానులు మాత్రం ఈ సినిమాను మరో మాస్ బ్లాక్‌బస్టర్‌గా మార్చాలనే ఆశతో ఉన్నారు. పీరియాడికల్ కథ, ద్విపాత్రాభినయం, గోపీచంద్ మలినేని మార్క్ మాస్ ట్రీట్మెంట్… ఇవన్నీ కలిస్తే ‘ఎన్.బి.కె 111’ టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.మరి చివరికి హీరోయిన్ ఎవరు? బడ్జెట్ ఎంత వరకు ఖరారవుతుంది? స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు జరుగుతాయి? అన్న విషయాలపై పూర్తి క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: