అఖండ–2 రన్‌ జనవరి 9 వరకు కంటిన్యూ..

Chakravarthi Kalyan
ఈ ఏడాది విడుదలైన సినిమాలు చాలా వరకు రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి.  బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ–2’ సినిమా డిసెంబర్‌ 5న విడుదల కావాల్సింది. కొన్ని ఫైనాన్షియల్‌ ఇబ్బందుల వల్ల ఆ సినిమా  డిసెంబర్‌ 12న విడుదలవ్వటం అందరికి తెలిసిందే. సినిమా విడుదలైన తర్వాత సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సనాతన ధర్మానికి, భారతదేశ ఔన్నత్యానికి, దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణను సూపర్‌మ్యాన్‌గా చూపించిన తీరుకు హ్యాట్సాఫ్‌ అన్నారు.

శివభక్తులైతే పూనకాలతో ఊగిపోయారు.  సినిమా చూసి ఇది తమ సినిమా అంటూ బాలయ్యను శివునిగా ఊహించుకుని పొంగిపోయారు.  హిందూ ధర్మాన్ని ఆరాధించే భక్తులందరూ నిండుమనసుతో ఆశీర్వదించారు. ఏదేమైనా ఎవరేమనుకున్నా ఒక సినిమా విడుదలవ్వాల్సిన సమయంలో విడుదలవ్వకుండా వాయిదా పడితే కలెక్షన్ల పరంగా రెవెన్యూ దాదాపు 20 శాతం వరకు మైనస్‌ అవ్వటం ఖాయం.

అదే ఈ సినిమా విషయంలో జరిగింది.  ఇప్పటికే ‘అఖండ–2’ సినిమా విడుదలైన కొన్ని కేంద్రాలలో సేఫ్‌గా నిలిచింది. మరికొన్ని చోట్ల ఇంకా రన్‌ అవుతుంది. ‘రాజాసాబ్‌’ విడుదలయ్యేవరకు ఈ సినిమా రన్‌ ఇలానే ఉంటే అందరూ సేఫ్‌గా బయటపడతారని ట్రేడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. జస్ట్‌ వెయిట్‌ అండ్‌ సీ...

9490520108.. ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌స్య‌లు, ఎమ్మెల్యేల ప‌నితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్ర‌జ‌ల ఇబ్బందులు, అక్క‌డ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ప‌రిస్థితులు, రాజ‌కీయ అంశాల‌పై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: