సంక్రాంతి వస్తుందంటే చాలు తెలుగు సినీ ప్రేక్షకులకు పండగ వాతావరణమే.. ఎందుకంటే గ్రామాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించడంతోపాటు థియేటర్ ల వద్ద సినిమాల కోలాహలం కనిపిస్తుంది. సంక్రాంతి పండగకి చాలా మంది తెలుగు హీరోలు తమ సినిమాలను విడుదల చేస్తారు.అలా సంక్రాంతికి చాలా మంది ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో వచ్చి కుటుంబ కథా ప్రేక్షకులను అలరిస్తారు. అలా ఈ ఏడాది కూడా చిరంజీవి, ప్రభాస్, విజయ్ దళపతి వంటి హీరోలు మన ముందుకు రాబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే 2024 లో ఒక చిన్న హీరో ముగ్గురు సీనియర్ హీరోలను వెనక్కి నెట్టారు. ఆయన నటించిన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో మార్మోగిపోయింది.మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ హీరో ఎవరు.. అనేది చూస్తే..
తేజ సజ్జా నటించిన హను-మాన్ మూవీ..ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన హను-మాన్ అనే పాన్ ఇండియా మూవీ. అయితే ఈ మూవీ విడుదల సమయంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా విడుదల రోజు పెద్ద హీరో సినిమా విడుదల కావడంతో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. కానీ చివరికి తట్టుకొని 2024 సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచారు.హను-మాన్ మూవీ భారీ హిట్ కొట్టడంతో ఈ సినిమాకి పోటీగా విడుదలైన మహేష్ బాబు, రవితేజ, నాగార్జున, వెంకటేష్ సినిమాలు తుక్కుతుక్కు అయిపోయాయి. ముఖ్యంగా హను-మాన్ మూవీ విడుదలైన రోజే గుంటూరు కారం సినిమా కూడా విడుదలైంది. మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో చాలామంది భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పెద్ద హీరో ముందు చిన్న హీరో సినిమా ఏం నిలబడుతుంది అని అందరూ హనుమాన్ మూవీని లైట్ తీసుకున్నారు.
కట్ చేస్తే సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ అవ్వడమే కాకుండా నాగార్జున, మహేష్ బాబు,వెంకటేష్, రవితేజ ల సినిమా కలెక్షన్లను వెనక్కి నెట్టి హనుమాన్ మూవీ భారీ హిట్ అయింది. అలా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా జనవరి 12న విడుదలవగా.. అదేరోజు తేజ నటించిన హనుమాన్ మూవీ కూడా విడుదలైంది.ఈ రెండు సినిమాల్లో హనుమాన్ మూవీ భారీ హిట్ కొట్టింది.అంతేకాకుండా వెంకటేష్ కెరియర్లో 75వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైంధవ్ మూవి భారీ డిజాస్టర్ అయింది.ఈ సినిమా డిజాస్టర్ తో వెంకటేష్ పరువు పోయింది. అదే జనవరి 13 న రవితేజ నటించిన ఈగల్ మూవీ కూడా విడుదలైంది.అలాగే నాగార్జున నటించిన నా సామి రంగా మూవీ కూడా 2024 సంక్రాంతి బరిలో నిలిచింది.అలా ఆ మూవీ జనవరి 14 న విడుదలైంది. ఈ సినిమా టాక్ బాగుండడంతో హనుమాన్ మూవీ తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో రెండో ప్లేసుని సంపాదించుకుంది.అలా 2024 సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ గా మొదట హనుమాన్ మూవీ నిలువగా రెండో ప్లేస్ ని నా సామి రంగా మూవీ ఆక్రమించుకుంది.