తమిళ్ , తెలుగు ఇండస్ట్రీ లలో స్టార్ హీరోయిన్గా అనేక సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో నయనతార ఒకరు. ఈమె తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లోనే మంచి విజయాలు దక్కాయి. దానితో ఈమె చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. దానితో చాలా సంవత్సరాల పాటు ఈమె అటు తమిళ్ ఇటు తెలుగు రెండు ఇండిస్ట్రీ సినిమాలలో నటిస్తూ రెండు ఇండస్ట్రీ లలో కూడా స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. కొన్ని సంవత్సరాల పాటు ఈమె కేవలం తమిళ్ సినిమాలపై మాత్రమే ఫోకస్ పెట్టి తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈమె అటు తమిళ్ ఇటు తెలుగు రెండు సినిమాలలో నటిస్తుంది. కొంత కాలం క్రితం ఈమె బాలీవుడ్ స్టార్ నటుడు అయినటువంటి షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన జవాన్ మూవీ లో హీరోయిన్గా నటించింది.
ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈమె కు హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈమెకు అద్భుతమైన క్రేజ్ ఉండడంతో ఈమెకు పెద్ద మొత్తంలో నిర్మాతలు పారితోషకం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఒక్క సినిమాకు నయనతార దాదాపు 11 కోట్ల మీద పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మకు ఈ స్థాయి పారితోషకం ఒక్కో మూవీ కి అందుతుంది అని వార్తల రావడంతో కొంత మంది జనాలు కొన్ని ఇండస్ట్రీ లలో మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ స్థాయి భారీతోషకం ఒక్కో సినిమాకు అందట్లేదు అని అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా నయనతారకు అద్భుతమైన క్రేజ్ ఉండడంతో ఆమెకు సూపర్ సాలిడ్ పారితోషకాన్ని నిర్మాతలు ఇస్తున్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.