పుష్ప 2: నెక్స్ట్ షెడ్యూల్ అప్పుడే?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ 'పుష్ప-2' సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో తెలిసిందే.ఇక ఈ సినిమాను క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ఈ మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈమధ్యనే రిలీజ్ అయిన పుష్ప-2 వీడియో గ్లింప్స్ అయితే ఈ సినిమాపై అంచనాలను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాపై అంచనాలు నెలకొనడంతో, ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సరికొత్త ఆల్‌టైమ్ రికార్డు కూడా క్రియేట్ అయ్యింది. పుష్ప-2 సినిమాకి సంబంధించిన ఆడియో రైట్స్ ను ప్రముఖ సంస్థ టీ-సిరీస్ ఏకంగా రూ.65 కోట్ల భారీ రేటుకు సొంతం చేసుకున్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.


ఒక సినిమా ఆడియో రైట్స్‌కే ఇంత మొత్తంలో భారీ రేటు రావడం మాములు విషయం కాదు. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే  హయ్యెస్ట్‌ రికార్డును క్రియేట్ చేసింది.ఇక పుష్ప-2 సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తనదైన విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఇక ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ మూవీలో హాట్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో చాలా రిచ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది. ఇక చూడాలి ఈ సినిమా రిలీజ్ అయ్యి బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, కేజిఎఫ్ రేంజ్ లో హిట్ అవుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: