ఇండియన్ సినిమాలలోనే పుష్ప-2 సరికొత్త చరిత్ర..!!

Divya
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన విడుదలైన పుష్ప ది రూల్ టీజర్ ని విడుదల చేసి ఒక్కసారిగా ఈ సినిమా పైన భారీ అంచనాలను పెంచేశారు డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. ప్రారంభంలో సాలిడ్ బజ్ క్రియేట్ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. మొదటి భాగం పాన్ ఇండియా హిట్టుగా నిలవడంతో రెండవ భాగంపై మరింత దృష్టి పెట్టారు. పుష్ప -2 చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ గతంలో ఎన్నడు లేనివిధంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు.
పుష్ప -2 విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అభిమానుల సైతం ఆశ్చర్యపోయే విధంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి బిజినెస్ కూడా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం పుష్ప-2 ఆడియో హక్కులను టి సిరీస్ సంస్థ ఏకంగా  రూ.65 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇండియన్ సినిమాలోని ఇది కనివిని ఎరుగని చరిత్ర అని కూడా చెప్పవచ్చు.దీంతో అభిమానులు పుష్పరాజ్ అప్పుడే తన వేటని ప్రారంభించారు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.

ఆడియో హక్కుల విషయంలో మాత్రం పుష్ప-2 సినిమా టాప్ లో నిలుచున్నది..RRR చిత్రానికి 26 కోట్లు, PS -24 కోట్లు, సాహో  రూ.22 కోట్లు, లియో  రూ.16 కోట్ల స్థానంలో ఉన్నది. ముంబైలో పుష్ప నిర్మాతలతో టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ డీల్ కుదుర్చుకున్నట్లుగా సమాచారం.అయితే ఇది కేవలం ఆడియో డీలా లేకపోతే మరేదైనా రైట్స్ కూడా దక్కాయ అనే సంగతి మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. పుష్ప  మొదటి భాగానికి బిజిఎం దేవిశ్రీప్రసాద్ అందించారు పాటలు కూడా ఆయనే పాడడంతో మంచి రెస్పాన్స్ లభించింది. మరి రాబోయే పుష్ప-2 చిత్రానికి సంబంధించి సాంగ్స్ ఏ రేంజ్ లో డిమాండ్ ఏర్పడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: