బన్నీ అభిమానులకి అదిరిపోయే సర్ప్రైజ్.. ఆ స్టార్ డైరెక్టర్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2  సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. పుష్ప వన్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో రెండవ భాగం కోసం బన్నీ మరింత కష్టపడుతున్నాడు. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో సైతం ఎంతటి పాజిటివిటీ ని క్రియేట్ చేసిందో మనం చూసాం.అంచనాలకు మించి ఈ సినిమాను సుకుమార్ తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి క్లారిటీ ఇస్తున్నాడు అల్లు అర్జున్.అయితే పుష్ప పార్ట్ 2 సినిమా తర్వాత తెలుగు దర్శకులు బన్నీతో సినిమా చేయడం కోసం క్యూ కడుతున్నారు. 

ముఖ్యంగా చెప్పాలంటే సందీప్ రెడ్డివంగా తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను లాక్ చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా పేరు ఇండియా రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా మరో రెండు ప్రాజెక్టులను బన్నీ లైన్లో పెట్టినట్లుగా తెలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో ప్రాజెక్ట్ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలో ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అలా వైకుంఠపురంలో సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.

ముఖ్యంగా బన్నీ తన కెరియర్ లోనే అత్యధిక స్థాయిలో విజయాన్ని అందుకొని బాండ్స్ బ్యాక్ అయిన సినిమా ఇదే ఈ సినిమాతో పాటు రేసుగుర్రం లాంటి సినిమాతో సక్సెస్ ఇచ్చిన సురేందర్ రెడ్డితో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట బన్నీ.ఈ ప్రాజెక్టు ఇంకా ఫైనల్ కాకపోయినప్పటికీ దర్శకుడు మాత్రం ఈ సినిమా కథపై కసరత్తు చేస్తున్నాడు. ఇటీవల ఏజెంట్ సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్న ఈయన ఈసారి ఎలాగైనా ఒక మంచి కథను అల్లు అర్జున్ తో చేయాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. సురేందర్ రెడ్డి పై ఉన్న నమ్మకంతో బన్నీ కూడా ఆయనతో సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: