ప్రభాస్ "బాహుబలి 2" మూవీకి ఆరేళ్లు..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ "మిర్చి" మూవీ వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగించాడు. ఆ తర్వాత ప్రభాస్ ... రాజమౌళి దర్శకత్వంలో అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా రూపొందిన బాహుబలి ది బిగినింగ్ ... బాహుబలి ది కంక్లూజన్ మూవీ లలో హీరో గా నటించి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని పాన్ ఇండియా రేంజ్ లో లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

 ఇది ఇలా ఉంటే బాహుబలి ది బిగినింగ్ మూవీ భారీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో బాహుబలి ది కంక్లూజన్ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాలు నడుమ బాహుబలి ది కంక్లూషన్ మూవీ 28 ఏప్రిల్ 2017 వ సంవత్సరం విడుదల అయింది. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా ప్రపం చవ్యాప్తంగా భారీ కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

ఈ మూవీ ద్వారా ప్రభాస్ ... అనుష్క ... తమన్నా ... రాజమౌళి క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగి పోయింది. ఈ మూవీ లో దగ్గుపాటి రానా విలన్ పాత్రలో నటించాడు. రానా క్రేజ్ కూడా ఈ మూవీ తో ఇండియా వ్యాప్తంగా పెరిగి పోయింది. ఇలా ఆ సమయంలో భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిన బాహుబలి ది కంక్లూషన్ మూవీ నేటితో ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ మూవీ లో రమ్యకృష్ణ ... నాజర్ ... సత్యరాజ్ కీలక పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: