నాని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'దసరా' ఓటీటీ వెర్షన్ ఆ సీన్స్ తో స్ట్రీమింగ్..!!

Anilkumar
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'దసరా'. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని నాని కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా.. సముద్రఖని, షైన్ టామ్, దీక్షిత్ శెట్టి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఫ్రెండ్షిప్, లవ్ రివైజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో నాని కీర్తి సురేష్ నటన, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచాయి. అలాగే సినిమాలో  క్లైమాక్స్ పార్ట్ అయితే ఊర మాస్ లెవెల్లో తెరకెక్కించాడు డైరెక్టర్. 

దీంతో ఈ మూవీ థియేటర్లో మంచి విజయాన్ని అందుకొని తాజాగా ఓటీటీలో విడుదలైంది. నిన్న రాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.   నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను భారీ ధరకి కొనుగోలు చేయగా.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో దసరా ఓటీటీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఓటిటి వెర్షన్ లో ఈ సినిమాకు సెన్సార్ బోర్డు కట్ చేసిన సీన్స్ తో పాటు కొన్ని మ్యూట్ చేసిన డైలాగులను కూడా ఆడ్ చేశారట. నిజానికి ఈ ట్రైలర్ విడుదలైనప్పుడు అందులో తెలంగాణ యాసలో నాని చెప్పే కొన్ని డైలాగులు ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. తీరా థియేటర్ కి వెళ్లి చూస్తే ఆ డైలాగ్స్ ని సెన్సార్ వాళ్ళు మ్యూట్ చేసేసారు.

దాంతో ఆ డైలాగ్స్ కోసం వెళ్లిన ఆడియన్స్ కి నిరాశ ఎదురయింది. కానీ ఇప్పుడు ఓటిటి లో మాత్రం సెన్సార్ కట్ చేసిన సీన్స్ అలాగే మ్యూట్ చేసిన డైలాగ్స్ ని కూడా యాడ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో థియేటర్లో నాని డైలాగ్స్ ని మిస్సయిన ఫ్యాన్స్ ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ మూవీ హిందీ వర్షన్ మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక దసరా మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని తన తదుపరి చిత్రాన్ని నూతన దర్శకుడితో చేస్తున్నాడు. నాని కెరీర్ లో ఇది 30వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో నాని సరసన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: