చీరకట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్లో మెరిసిపోతున్న ఆనంద్ దేవరకొండ హీరోయిన్..!

Pulgam Srinivas
అలనాటి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు సూపర్ క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగించిన రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ గత కొన్ని సంవత్సరాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డీల పడిపోయిన సందర్భంలో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన గరుడ వేగ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.
 

తాజాగా రాజశేఖర్ "శేఖర్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రాజశేఖర్ కొన్ని సంవత్సరాల క్రితమే తన కూతురు అయినటువంటి శివాత్మిక రాజశేఖర్ ను కూడా సినిమా ఇండస్ట్రీ లోకి రంగ ప్రవేశం చేయించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఆనంద్ దేవరకొండ హీరో గా రూపొందినటువంటి దొరసాని మూవీ తో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
 

ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత పలు మూవీ లలో నటించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో శివాత్మిక తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్.లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా శివత్మిక అదిరిపోయే లుక్ లో శారీ ని కట్టుకొని ... రెడ్ కలర్ లో ఉన్న స్లేవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: