మీడియం రేంజ్ హీరోలలో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 5 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది మీడియం రేంజ్ హీరోలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా మీడియం రేంజ్ హీరోలా సినిమాలకు కూడా కొన్ని సందర్భాలలో అదిరిపోయే రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగుతున్న వారి సినిమాలలో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
విజయ్ దేవరకొండ కొంత కాలం పురతం లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.
నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన అఖిల్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు.
రామ్ పోతినేని హీరోగా రూపొందిన ది వారియర్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి లింగు సామి దర్శకత్వం వహించాడు.
అఖిల్ హీరో గా రూపొందిన ఏజెంట్ మూవీ కి 37 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ రేపు అనగా ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల కాపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: