అఖిల్ "ఏజెంట్" మూవీ పై అదిరిపోయే క్రేజీ న్యూస్..?

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందినటువంటి స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

 ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్ లలో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టు కుంటూ ఉండటంతో ఈ మూవీ విడుదల కాక ముందే ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఒక వేళ ఈ సినిమా కనుక సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నట్లు అయితే ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ లో మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ మూవీ కి హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు. ఈ మూవీ ని రేపు అనగా ఏప్రిల్ 28 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల కు ముందు ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టెంటా తెగ వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ క్లైమాక్స్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఉండడున్నట్లు ... ఆ ట్విస్ట్ ఈ సినిమా రెండవ పార్ట్ కు దారి తీయనున్నట్లు ... ఏజెంట్ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఏజెంట్ పార్ట్ 2 మూవీ ని కూడా రూపొందించే విధంగా ఆ ట్విస్ట్ ని ఈ మూవీ యూనిట్ ప్లాన్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: