"ఆర్సి 16" లో ఆ ప్రాంత యాసలో మాట్లాడనున్న చరణ్..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా మూవీ తో గ్లోబల్ గా తన క్రేజీ ను పెంచుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న చరణ్ ఆ తర్వాత తన తండ్రి  చిరంజీవి హీరో గా రూపొందిన ఆచార్య మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. చిరంజీవి ... రామ్ చరణ్ కలిసి నటించడంతో ఆచార్య మూవీ పై ప్రేక్షకుల్లో భారీ లెవల్లో అంచనాలు పెరిగి పోయాయి.

అలా భారీ అంచనాలను నడుమ విడుదల అయిన ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చరణ్ ... శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క క్లైమాక్స్ సన్నివేశాలను ఈ చిత్ర బృందం చిత్రీకరిస్తుంది.

కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , సునీల్ , శ్రీకాంత్ , ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత చరణ్ "ఉప్పెన" మూవీ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ చరణ్ కెరియర్ లో 16 మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: