మరోసారి రిలీజ్ కి రెడీ అయిన 'ఆరెంజ్'.. ఫ్యాన్స్ కి పండగే..!!

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' మూవీ ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ అవ్వబోతుందట. ఈసారి జపాన్ ఆడియన్స్ను ఆకట్టుకునేందుకు అక్కడ  ఆరెంజ్ మూవీ నీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక పక్క జపాన్లో ట్రిపులర్ మేనియా కంటిన్యూ అవుతోంది. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ ని జపాన్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఆరెంజ్ సినిమాను జపనీస్ కోసం, అక్కడున్న రామ్ చరణ్ ఫాన్స్ కోసం రీరిలీజ్ చేయబోతున్నారట. రీసెంట్ గానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరెంజ్ మూవీ రీరిలీజై భారీ కలెక్షన్స్ అందుకుని సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు జపాన్ లో మే 6 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

 త్రిబుల్ ఆర్ మూవీ కారణంగా రామ్ చరణ్ కి వచ్చిన గ్లోబల్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను జపాన్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారట దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇందుకు కావలసిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. ఇక మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన మూవీ ఆరెంజ్ అప్పట్లో డిజాస్టర్ టాక్ ని మూట కట్టుకుంది. కానీ ఆ తర్వాత ఆడియన్స్ అందరి చేత మోస్ట్ అండరేటేడ్ కల్ట్ మూవీ గా అప్లాజ్ అందుకుంది. ఇక రీసెంట్ గా రీ రిలీజ్ అయిన ఈ మూవీ కోట్లల్లో కలెక్షన్స్ అందుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు రీసెంట్ గా ఈ మూవీ ని చూసిన ఫ్యాన్స్, ఆడియన్స్ అంతా ఆరెంజ్ 2 రావాలనే డిమాండ్ ని సైతం తెరిపైకి తీసుకొచ్చారు.

ఇక అలాంటి సూపర్ రెస్పాన్స్ ని అందుకున్న ఆరెంజ్ మూవీ ని ఇప్పుడు జపాన్లో అక్కడి ఆడియన్స్ కోసం మే 6న విడుదల చేయబోతున్నారు. మరి అక్కడ ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ' గేమ్ ఛేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న తరహా పాత్రలు పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక  సినిమాలో చెర్రీ సరసన కీయారా అద్వాని, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: