ప్రభాస్ కి తన సినిమాల్లో అస్సలు నచ్చని సినిమా ఏంటో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు సౌత్ లోనే నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ కి వరస ప్లాపులు వచ్చినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలన్నింటిని పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు డార్లింగ్. ఇక ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియాలో అది ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. 

అదేంటంటే.. ప్రభాస్ కి ఇప్పటివరకు తాను నటించిన సినిమాల్లో ఓ సినిమా అంటే అసలు నచ్చదట. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వచ్చిన ప్రభాస్ అసలు చూడడట. ఆ సినిమా మరేదో కాదు 2007లో వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన 'యోగి' మూవీ. ప్రభాస్ కి ఇష్టం లేకుండానే ఈ సినిమా చేసి భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో పెద్దగా కంటెంట్ కూడా ఏమీ ఉండదు. కేవలం మొదటి సెంటిమెంట్ తోనే ఈ సినిమా ఉంటుంది. కానీ ఆ మదర్ సెంటిమెంట్ లాస్ట్ కి రివర్స్ అవుతుంది. అయితే ప్రభాస్ ఈ కథన వినగానే క్లైమాక్స్ మార్చకపోతే మూవీ ప్లాప్ అవుతుందని చెప్పాడట. అయినా వినకుండా వివి వినాయక్ అదే క్లైమాక్స్ ను పెట్టగా..

సినిమా కాస్త అట్టర్ ప్లాప్ అయింది.ఇందులో హీరోయిన్గా నటించిన నయనతార నటన కూడా సినిమాలో మరి ఓవర్ యాక్టింగ్ లా అనిపించిందని అప్పట్లో బాగా కామెంట్స్ అనిపించాయి. అలా మొత్తంగా యోగి సినిమా అంటే ప్రభాస్కి అస్సలు నచ్చదట. అయినా కూడా వి వి వినాయక్ బలవంతం మేరా ప్రభాస్ ఈ సినిమాలో నటించడం జరిగింది. అయితే ప్రభాస్ కి యోగి సినిమా అంటే అసలు నచ్చదని ఇప్పటివరకు తన అభిమానులకు కూడా తెలియదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, సలార్, ప్రాజెక్టు కే, మారుతి సినిమాలతో తెగ బిజీగా ఉన్నాడు. వీటిలో ఆదిపురుష్ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రెజెంట్ ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. జూన్ 16న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆదిపురుష్ తర్వాత సెప్టెంబర్ 28న సలార్ విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: