ఎట్టకేలకు ముగిసిన ఐటీ దాడులు..!!

Divya
మైత్రి మూవీస్ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ నివాసంలో గత కొద్ది రోజుల నుంచి ఐటి సోదరులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. గత ఐదు రోజులుగా ఐటి బృందాలు సైతం తమకు సంబంధించిన వాటన్నిటిని సోదాలు చేస్తూ ఉన్నారు. పుష్ప మొదటి భాగం బడ్జెట్ వసూలు చేసిన కలెక్షన్స్ పుష్ప-2 నిర్మాణానికి పెట్టిన బడ్జెట్ వివరాలు నటీనటుల టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్ ఆదాయ పన్ను చెల్లింపు జిఎస్టి చెల్లింపు తదితర వివరాలను తెలుసుకుంటున్నారు ఐటి అధికారులు..

మైత్రి మూవీ మేకర్స్ పై ఐటి శాఖ గత కొద్ది రోజులుగా స్పీడ్ పెంచింది మైత్రి మూవీకి ముంబైలో ఉన్న లింకుల పైన అధికారికాంగ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా ముంబైకి చెందిన ఒక ఫైనాన్షియర్ నుంచి డబ్బులు తీసుకొని బాలీవుడ్లో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు సైతం సిద్ధమైనట్లుగా ఐటి అధికారులు గుర్తించారు. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా ఇప్పటికీ అడ్వాన్సుగా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు ఐటి శాఖ గుర్తించింది.

ఢిల్లీ నుంచి వచ్చిన కొంతమంది అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 లో ఉన్న సినిమా సంస్థలు గురువారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టడం జరిగిందట. సినిమాలకు పెట్టుబడులు ఎలా వచ్చాయన్న దానిపై ఐటి అధికారులు విచారణ జరిపినట్లు సమాచారం తాజాగా ఈ సోదాలన్నీ ముగిసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో పూర్తి సమాచారాన్ని ఐటి అధికారులు ఎప్పుడు తెలియజేస్తారో చూడాలి మరి. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇలా ఐటీ దాడులు జరగడం జరిగింది.. అయితే ఇందులో మాజీ మంత్రి బాలినేని కూడా భాగస్వామ్యం ఉన్నారంటూ వార్తలు వినిపించాయి వైజాగ్ జనసేన నేతలు కూడా ఈ విషయంపై ఆరోపించడంతో ఆయన తీవ్రంగా ఖండించారు ఒకవేళ ఇందులో పెట్టుబడులు ఉన్నాయని నిరూపిస్తే తన ఆస్తి మొత్తం రాసేస్తానని రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: