సినిమాలకు దూరం కాబోతున్న గుణ శేఖర్...!!

murali krishna
తెలుగు సినీ ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఎక్కువ గా వినిపిస్తున్న దర్శకుల పేర్లలో గుణశేఖర్ కూడా ఒకటి. శాకుంతలం సినిమా ఫుల్ రన్ లో కేవలం 4 కోట్ల రూపాయల కలెక్షన్లను మాత్రమే సాధించిన నేపథ్యంలో గుణశేఖర్ పేరు వినిపిస్తుండటం విశేషం.
ఈ మధ్య కాలం లో ఒక పెద్ద సినిమా ఇంత దారుణంగా కలెక్షన్లను సాధించడం శాకుంతలం సినిమా విషయంలో నే జరిగిందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఈ దర్శకుడి ట్రాక్ రికార్డ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. సైనికుడు, వరుడు, నిప్పు, శాకుంతలం సినిమాలను కళాఖండాలు అని నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. రుద్రమదేవి సినిమా సక్సెస్ సాధించినా ఆ సినిమా సక్సెస్ కు అల్లు అర్జున్ అనుష్క కారణమని చాలామంది భావిస్తారు. రుద్రమదేవి  సినిమా కూడా విడుదలకు ముందు, తర్వాత ఎన్నో ఇబ్బందుల ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
గుణశేఖర్ దర్శకత్వాని కి గుడ్ బై చెప్పాలని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి కళాఖండాల వల్ల బయ్యర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని కొంతమంది చెబుతున్నారు. అనవసరమైన సెట్స్ తో గుణశేఖర్ బయ్యర్లను  ముంచుతున్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల టేస్ట్ ను అస్సలు పట్టించుకోకుండా భారీ బడ్జెట్ సినిమాలను తీస్తే లాభం ఏంటని కొంతమంది విమర్శిస్తున్నారు..
ఇతర డైరెక్టర్లను చూసి గుణశేఖర్ చాలా విషయాలను నేర్చుకోవాలని  కామెంట్లు కూడా చేస్తున్నారు. గుణశేఖర్ సినిమాలకు గుడ్ బై చెబుతారో లేక మరో ప్రాజెక్ట్ తో ముందుకొస్తారో మరి చూడాలి. లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్న దర్శకనిర్మాతలు  కూడా బడ్జెట్ విషయంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లు హీరోయిన్ల మార్కెట్ ను కూడా నాశనం చేస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం విశేషం.హీరోయిన్లు కూడా ఇలాంటి సినిమాలపై కొద్దిగా ఫోకస్ తగ్గించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: