ఆందోళనకరంగా శరత్ బాబు ఆరోగ్యం..!!

Divya
టాలీవుడ్ నటుడు శరత్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలలో నటించి హీరోగా విలన్ గా కూడా బాగానే పేరు సంపాదించారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన వయసు 71 సంవత్సరాలు గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. ఈనెల 20వ తేదీన హైదరాబాదులో AMG ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది అప్పటినుంచి అక్కడే ఈయన చికిత్స తీసుకుంటున్నట్లుగా సమాచారం.

ప్రస్తుతం ఈయన ఐసీయూలో వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఈయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా చెప్పలేమని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మరొకసారి శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బుల్లెట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన శరత్ బాబు టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. దాదాపుగా ఇప్పటివరకు 200 కు పైగా సినిమాలలో నటించారు. కేవలం హీరో గానే కాకుండా అనేక చిత్రాలలో కూడా సహాయక నటుడి పాత్రలో కూడా నటించడం జరిగింది.

తాజాగా వికె నరేష్ నటించిన మళ్లీ పెళ్లి అనే సినిమాలో కూడా నటించారు ఈయన కృష్ణ గారి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. కేవలం నరేష్ కోరిక మేరకే ఈ సినిమాలో కాదనలేక నటించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక షూటింగ్ నిమిత్తం శరత్ బాబు హైదరాబాద్ టు చెన్నై వంటి ప్రాంతాలకు తరచూ వెళ్తూ ఉండేవారు. ఇక శరత్ బాబు భార్య రమ ప్రభ.. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది. గతంలో కూడా శరత్ బాబు పైన ఎన్నో విమర్శలు కూడా వినిపించాయి. ప్రస్తుత మైతే శరత్ బాబు ఆరోగ్యం చాలా క్లిష్టంగానే ఉందని వైద్యులు తెలియజేసినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాలి అంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: