అలాంటి వాడే భర్తగా కావాలంటున్న జాన్వికపూర్...!

Divya
దివంగత నటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందాల ముద్దుగుమ్మగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తన టాలెంట్ తో అంతకుమించి ఇమేజె సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక సినిమాలలో నటించడానికి కూడా సదా సిద్ధం అవుతున్నట్లు వ్యవహరించింది. ఇక ఇప్పటివరకు చేసిన సినిమాలు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయనటంలో సందేహం లేదు. ఇకపోతే ఒక ప్రాంతంలో ఉండిపోకుండా అలా తిరుగుతూ ప్రపంచాన్ని చుట్టేసి రావాలని ..పుస్తకాలు రాయడం ఇష్టమని చెప్పే ఈమె.. కొత్త వ్యక్తులను కలుసుకోవాలంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకు వచ్చింది.
ఇకపోతే తనకు ఇష్టమైన కారు బెంజ్ అని చెప్పిన జాన్వి కపూర్ తనకు నచ్చిన టూరిజం స్పాట్ ఒక్క మాల్దీవులు మాత్రమే అంటూ చెప్పింది. అయితే ఏదైనా ఇబ్బంది వచ్చినా లేదా మనశ్శాంతి లేకపోయినా అక్కడికే వెళ్తానని ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పకుండా అక్కడికి ఒకసారి వెళ్లి వస్తానంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇకపోతే కాబోయే వాడు ఎలా ఉండాలి అన్న ఒక రొటీన్ ప్రశ్నకు భిన్నమైన విషయాలను సమాధానంగా చెప్పుకొచ్చింది.
తన ప్రొఫెషన్ను గౌరవించే వ్యక్తి తన జీవితంలోకి రావాలని కోరుకుంటున్నట్లు.. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలని తెలియని విషయాలను నేర్చుకుంటే ఏదో ఒకటి తనకు ప్రోత్సాహంగా నేర్పించే వ్యక్తి ఉండాలి అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది . అంతేకాదు తన తండ్రి కంటే ఎక్కువ హైట్ ఉండాలన్న ఈమె తనను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు భర్తగా రావాలి అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే తనకు ఎలాంటి వాడు కావాలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక జాహ్నవి కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా ఉంది. అంతే కాదు తెలుగులో మరో రెండు సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: