సర్పయాగం మూవీ వెనుక అసలు కారణం అదా....!!

murali krishna
శోభన్ బాబు తండ్రిగా, రోజా  కూతురిగా వచ్చిన సర్పయాగం సినిమా గుర్తుందా ? ఈ సినిమాలో రోజాను కొందరు బలవంతం చేయగా ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది.
తన కూతురికి జరిగిన దానికి బదులుగా శోభన్ బాబు సదరు వ్యక్తులను ఒక్కొక్కరిగా హతమార్చుతాడు. ఇదే సినిమాగా వచ్చింది. అయితే ఇది కేవలం కల్పిత పాత్రలతో తీసిన సినిమా మాత్రమే కాదు. ఒంగోలు లో జరిగిన ఒక సంఘటనను రామానాయుడు సినిమాగా తీసాడు. అప్పట్లో ఒంగోలు లో చిల్లర రౌడీ లు కాస్త ఎక్కువగానే ఉండేవారు. అక్కడే కోదండ రామి రెడ్డి అనే వ్యక్తి ఒక్కాగానొక్క కూతురిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు.
అతడికి టిప్ టాప్ అనే డ్రై క్లీనింగ్ సెంటర్ ఉండేది. అందుకే అతడిని అందరు టిప్ టాప్ రెడ్డి అని పిలిచేవారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న తన కూతురిని ఒకరోజు అదే ఊర్లో డబ్బు మదం పట్టిన కొందరు వ్యక్తులు మానభంగం చేసారు. ఆమె ఆ దారుణాన్ని తండ్రికి చెప్పుకోలేక సదరు వ్యక్తుల పేర్లు లెటర్ లో రాసి పెట్టి ఎవ్వరిని వదలద్దు అంటూ చివరి కోరిక కోరింది. ఆమె కోరిన కోరిక ప్రకారం కిరాయి హంతకుల చేత ఒక్కొక్కరికి ఒక్కో పథకం రచించి టిప్ టాప్ రెడ్డి చంపుతూ వచ్చాడు. మానభంగానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులలో ఇద్దరినీ చంపించాక మూడో వ్యక్తిని చంపడానికి ముందే ఆ హత్యలు చేయించింది అతడే అని గుర్తించి అరెస్ట్ చేసారు.మూడో వ్యక్తిని కూడా చంపి వచ్చి లొంగిపోతాను అంటూ పోలీసుల కాళ్ళ వేళ్ళ పడ్డాడు టిప్ టాప్ రెడ్డి. కానీ అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు పంపించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు విడుదల అయ్యి వచ్చి కొండా మీద ఉన్న ఆలయంలో ఉంటూ తన శేష జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. ఇక ఈ సంఘటన ఒంగోలు వాసులను ఎంతగానో కదిలించింది. ఉదయం పేపర్ లో ఈ విషయాన్నీ అసంభవామి యుగే యుగే పేరుతో రాయగా సూపర్ హిట్ ఎపిసోడ్స్ అయ్యేయి. ఇదే సినిమాను సర్పయాగం పేరుతో తీయగా మంచి విజయాన్ని అందుకుంది. కథ మాత్రమే కాకుండా సినిమాకు కూడా పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: