గాసిప్పు వార్తల పై ఎదురుదాడి చేసిన ఆరాధ్య బచన్ !

Seetha Sailaja
సినిమా సెలెబ్రెటీల జీవితాల గురించి నెగిటివ్ వార్తలు గాసిప్పులు ప్రచారంలోకి తీసుకురావడం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలవాటుగా పెట్టుకున్నాయి. తెల్లవారితే చాలు ఎవరో ఒకరు సెలెబ్రెటీ ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని అతడు మరణానికి దగ్గరగా ఉన్నాడు అంటూ లేదంటే పలానా సెలెబ్రెటీ వ్యక్తిగత జీవితంలో ఫలానా చీకటికోణాలు ఉన్నాయి అంటూ వార్తలు ప్రచారంలోకి తీసుకురావడం ఒక అలవాటుగా చాల యూట్యూబ్ ఛానల్స్ మార్చుకున్నాయి.

అలవాటులో భాగంగా ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై కొన్ని యూట్యూబ్ లో వచ్చిన తప్పుడు కథనాల పై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది అన్నవార్తలు వస్తున్నాయి. ఆరాధ్య పై వచ్చిన వీడియోల్ని తక్షణం తొలగించాలని గూగుల్ ను కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా అలాంటి తప్పుడు వార్తలను ప్రచారంలోకి తీసుకు వచ్చిన  యూట్యూబ్ ఎకౌంట్ల వివరాలను తమకు తెలపాలని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది.  

కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఆరాధ్య బచ్చన్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదంటూ తప్పుడు కథనాలతో సోషల్ మీడియాలో హడావిడి చేసాయి. అంతేకాదు ఆమె ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు అంటూ మరింత విషమంగా ఉందని తప్పుడు వార్తలను ప్రచారంలోకి తీసుకు వచ్చాయి. ఈ యూట్యూబ్ ఛానల్స్ చేసిన హంగామా అంతా అమితాబ్ కుటుంబ దృష్టికి రావడంతో వారు కోర్టును ఆశ్రయించారు.


ఇలాంటి కథనాలు రావడం పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టు అభిప్రాయపడుతూ దేశంలో ప్రతి బిడ్డను గౌరవించాల్సిన అవసరం అందరిపై ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి అసత్యప్రచారం చేసిన 9 యూట్యూబ్ ఛానెళ్లను కోర్టు పూర్తిగా నిషేధించి వారిపై చట్టపరమైన చర్యలు ఆదేశించింది. సాధారణంగా టాప్ హీరోలు హీరోయిన్స్ ఆరోగ్య ఆర్ధిక పరిస్థితుల పై ఇలాంటి గాసిప్పుల వీడియోలు సందడి చేయడం సర్వసాధారణం. అయితే దీనికి భిన్నంగా ఒక సెలెబ్రెటీ కూతురు పై ఇలాంటి అసత్య ప్రచారం చేయడం అందరికి షాక్ ఇస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: