నవదీప్ "న్యూసెన్స్" వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి నవదీప్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నవదీప్ తన కెరియర్ లో ఎన్నో మూవీ లలో హీరో గా మరియు ఎన్నో మూవీ లలో ఇతర ముఖ్య పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు.

ఇది ఇలా ఉంటే నవదీప్ కెరియర్ లో సోలో గా అద్భుతమైన విజయం సాధించిన సినిమా "గౌతమ్ ఎస్ ఎస్ సి" ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం తో పాటు ఈ మూవీ లోని నవదీప్ నటన కు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు కూడా లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో నవదీప్ సినిమాల్లో హీరో పాత్రలు మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నవదీప్ "న్యూసెన్స్" అనే వెబ్ సిరీస్ లో హీరో గా నటించగా బిందు మాధవి ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించింది.

తెలుగు  ప్రముఖ "ఓ టి టి" ప్లాట్‌ ఫామ్ లలో ఒకటి అయిన ఆహా వీడియో మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించాయి. ఈ సిరీస్ యొక్క సీజన్ 1 మే 12, 2023 నుండి ఆహా లో స్ట్రీమింగ్  కానుంది. శ్రీ ప్రవిన్ కుమార్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ వెబ్ సిరీస్ తో నవదీప్ మరియు బిందు మాధవి ఎలాంటి రెస్పాన్స్ ను ప్రేక్షకులనుండి తెచ్చుకుంటారో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: