గేమ్ చేంజర్: వెయ్యిమందితో ఫైట్.. సూపర్ క్లైమాక్స్?

Purushottham Vinay
ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటేస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే  అంచనాలు ఓ రేంజిలో నెలకొన్నాయి.ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ చాలా ఆసక్తిగా ఉండగా.. తాజాగా ఈ క్లైమాక్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో చరణ్ దాదాపు వెయ్యి మంది ఫైటర్స్ తో పోరాడేందుకు రెడీ అవుతున్నారట చరణ్. గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ కోసం చాలా భారీగానే ప్లాన్ చేశారట డైరెక్టర్ శంకర్. హైదరాబాద్ శివార్లలో ఆల్రెడీ ఈ ఫైట్ కోసం సెట్ వర్క్ ని కూడా పూర్తి చేశారట. ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్న ఈ క్లైమాక్స్ షూటింగ్ వచ్చే నెల తొలివారం దాకా జరుగుతుందని సమాచారం తెలుస్తుంది.


ఇంకా ఈ ఫైట్ సీన్స్ కోసం దాదాపు వెయ్యి మంది స్టంట్ మ్యాన్స్ పాల్గొంటారని.. ఇంకా అలాగే కేజీఎఫ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అండ్ అరివు ఈ క్లైమాక్స్ ఫైట్ ను చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దిపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, ఇంకా తెలుగు బ్యూటీ అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు.ఇక గత కొద్ది రోజులుగా చాలా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ శంకర్. ఇటీవల  ఇండియన్ 2 సినిమా కీలక షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన శంకర్ కమల్ హాసన్ కు థాంక్స్ చెబుతూ రామ్ చరణ్ మూవీ పై ఫ్యాన్స్ కి మాసివ్ అప్డేట్ అందించారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా క్లైమాక్స్ షూట్ ను స్టార్ట్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: