ఆదిపురుష్: VFX లో మార్పులు చేశారుగా?

Purushottham Vinay
బాలీవుడ్  డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్ లు జంటగా నటిస్తోన్న సినిమా 'ఆది పురుష్'. ఈ సినిమా ముందు నుంచే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసిన దగ్గర్నుంచి ఏదో ఒక వివాదం ఈ సినిమాని చుట్టుముడుతూనే ఉంది. భారీ సినిమా ఇంకా అందులోనూ ప్రభాస్ మూవీ అంటే ఫ్యాన్స్ చాలా ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. అలాంటి సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ గ్లింప్స్, టీజర్ అభిమానులను ఇంకా నెటిజన్లను తీవ్రంగా నిరాశపరిచింది. రాముడిగా ప్రభాస్ లుక్స్ కూడా అంత ఆశించిన స్థాయి లో గొప్పగా లేవని అలాగే రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ అసలు సూట్ అవ్వలేదని చాలా తీవ్ర ఆరోపణలు వచ్చాయి.'ఆది పురుష్' ను ‘మోషన్ కాప్చర్ టెక్నాలజీ’ తో న్యాచురల్ గా గ్రాఫిక్స్ ఉండేలా చేస్తామని సినీ దర్శకుడు ఓం రౌత్ ఇంతకుముందే ప్రకటించినా కానీ ఆ మాటను మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. అత్యంత అధునాతన టెక్నాలజీని ఉపయోగించినా.. సినిమా టీజర్ మాత్రం ఏదో కార్టూన్ సినిమా చూస్తున్నట్టే అనిపించిందని చాలా మంది ట్రోల్ చేశారు.


ఇక 'ట్రైబెకా ఫెస్టివల్'లో 36 దేశాల నుంచి 127 మంది చిత్రనిర్మాతలు, 109 సినిమాలు  పార్టిసిపేట్ చేయబోతున్నాయంటూ ఇటీవల ఓ వీడియో విడుదలైంది. చివర్లో 'ఆదిపురుష్' సినిమాలోని ఓ చిన్న క్లిప్ కూడా అందులో ఉంది. దీన్ని కనుక మీరు గమనిస్తే వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లో మార్పులు చేసినట్టు చూస్తుంటే తెలుస్తోంది. బ్యాగ్రౌండ్ కలర్ తప్ప పెద్దగా మార్పులేమీ చేయలేదనట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇంతకుముందు రిలీజైన టీజర్ లోని క్లిప్లింగ్ ను పోల్చి చూస్తే ఈ విషయం పూర్తిగా అర్థమౌతుంది. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లో మార్పులు చేసిన టీజర్ గానీ, క్లిప్పింగ్స్ గానీ మేకర్స్ ఇప్పటి దాకా అధికారికంగా రిలీజ్ చేయలేదు. కనీసం వారు ప్రకటించలేదు కూడా. కానీ తాజా ప్రోమోతో ఆ మార్పులు జరిగినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: