ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కలవరపెడుతున్న జియో స్టూడియోస్ ప్లాన్ !

Seetha Sailaja
ఓటీటీ లు జనంకు అందుబాటులోకి వచ్చేయడంతో సినిమాలు చూసే అలవాటు చాలావరకు తగ్గిపోతోంది. సినిమా ఎంతో బాగుంది అని టోటల్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు ధియేటర్ల వైపు రావడం పూర్తిగా తగ్గించి వేస్తున్నారు. దీనితో సినిమాల సక్సస్ రేట్ విపరీతంగా తగ్గి పోయింది. ఇలాంటి పరిస్థితులలో జియో స్టూడియోస్ మార్కెటింగ్ ప్లాన్ కు సంబంధించిన వార్తలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కలవర పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

4జి లాంచ్ తో టెలికాం రంగంలో పెను విప్లవం సృష్టించిన ముఖేష్ అంబానీ ఇప్పుడు ఓటిటి రంగంలో కూడ పెను విప్లవాన్ని సృష్టించడానికి భారీ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇటీవలే ముంబైలో జియో స్టూడియోస్ ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. త్వరలో తమ ప్లాట్ ఫార్మ్ మీద విడుదల కాబోయే 100 సినిమాలు వెబ్ సిరీస్ ల టైటిళ్ళను ఓ ట్రైలర్ రూపంలో రిలీజ్ చేసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. కనీసం పదిహేను వందల కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనాలున్న షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ ని కొనుగోలు చేయడమే కాకుండా బాలీవుడ్ స్టార్లు నటించిన భారీ చిత్రాలు కూడ నేరుగా ఇళ్ళలోకి జియో తీసుకురాబోతోంది.  

ఈ ప్లాన్ అంతా అమలు జరగడానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉన్నప్పటికీ ఇలా జియో తన విశ్వరూపాన్ని చూపిస్తే భవిష్యత్ లో ధియేటర్లకు జనం ఎలా వస్తారు అన్న సందేహాలు ఎవరికైనా కలుగుతాయి. ప్రస్తుతానికి బాలీవుడ్ తో మొదలుపెట్టి నెమ్మదిగా ప్రాంతీయ భాషల సినిమాల వైపు కూడ జియో అడుగులు వేస్తే దక్షిణాది సినిమా రంగానికి కూడ కష్టాలు తప్పక పోవచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి. అదే జరిగితే ఫిలిం ఇండస్ట్రీని నమ్ముకుని జీవిస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడే ఆస్కారం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి. భారతీయుల అరిచేతిలో సెల్  ప్రపంచాన్ని చాల తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చిన జియో సినిమా రంగంలో కూడ సమూల మార్పులు తీసుకు రావచ్చు..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: