పవన్ అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్న అకిరా నిర్ణయం !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినిమా ఎంట్రీ గురించి పవర్ స్టార్ అభిమానులు అంతా ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తుంటే అకిరా నందన్ సంగీత దర్శకుడుగా మారడం చాలామందికి షాక్ ఇచ్చింది. రైటర్స్ బ్లాక్ అనే చిన్న షార్ట్ ఫిలింకి అకిరా ఇచ్చిన మ్యూజిక్ బాగుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ షార్ట్ ఫిలిం చాల చిన్నది.

ఒక వర్ధమాన రచయిత ఏం రాయాలో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితి నుండి ఎలా బయటపడ్డాడు అన్న పాయింట్ చుట్టూ అల్లబడిన ఈ షార్ట్ ఫిలిం ను కార్తికేయ యార్లగడ్డ మంచి దర్శకత్వం చేసాడు అన్న ప్రశంసలు వస్తున్నాయి. ఈ కథకు సంబంధించి అకిరా ఇచ్చిన మ్యూజిక్ అన్నివిధాల సరిపోయింది అన్న మాటలు వినిపిస్తున్నాయి.

అయితే పవన్ అభిమానులకు కావలసింది ఇది కాదు. ఒక యంగ్ హీరోగా అకిరా సంచలనాలు సృష్టించడం. వాస్తవానికి అకిరా కు నటన కంటే మ్యూజిక్ పై ఎక్కువ ఆశక్తి అని తెలుస్తోంది. చిన్నతనం నుండి పియోనో వాయించడం నేర్చుకున్న అకిరా తన స్కూల్ ఫంక్షన్స్ లో పియోనో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చి అందరిని ఆకట్టుకునేవాడు. అయితే టాప్ హీరోల వారసులు అంతా హీరోలుగా పరిచయం అవుతున్న పరిస్థితులలో అకిరా ఎంట్రీ ఎప్పుడూ అంటూ అతడి తల్లి రేణు దేశాయ్ ని పవన్ అభిమానులు ప్రశ్నిస్తూ ఉంటారు.

అయితే రేణు దేశాయ్ మాత్రం ఈవిషయం పై స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా అకిరా సినిమా హీరోగా కంటే మంచితనంలో హీరోగా మారాలని తల్లిగా కోరుకుంటున్నాను అంటూ ఆమధ్య కామెంట్ చేసింది. మెగా ఫ్యామిలీ సభ్యులు అందరిలోనూ బాగా పొడుగుగా ఉండే అకిరా హీరోగా ఎంట్రీ ఇస్తే రికార్డులు క్రియేట్ అవుతాయని పవన్ అభిమానుల వాదన. మరి అకిరా నిర్ణయం ఎలా ఉంటుందో తెలియకపోయినప్పటికీ ప్రస్తుతానికి ఈ మ్యూజిక్ చేసిన షార్ట్ ఫిలింతోనే అభిమానులు తృప్తిపడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: