"ఏజెంట్" మూవీ నుండి ఈరోజు ఆ సమయానికి మూడవ పాట విడుదల..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.  ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ కి హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నాడు. మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు ... తమిళ ... కన్నడ ... మలయాళ ... హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
 

ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అందులో అఖిల్ నటన బాగుండడంతో ఈ మూవీ పై అక్కినేని అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేసింది. నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మూడవ పాటకు సంబంధించిన ప్రోమో ను విడుదల చేసింది. ఈ పాట ప్రోమో కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

 తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "రామ కృష్ణ" అంటూ సాగే మూడవ సాంగ్ విడుదల తేదీని సమయాన్ని ప్రకటించింది. ఈ మూవీ లోని మూడవ సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న అఖిల్ "ఏజెంట్" మూవీ తో ఏరెంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ మూవీ ని దర్శకుడు సురేందర్ రెడ్డి మోస్ట్ స్టైలిష్ యాక్షన్ త్రిల్లర్ మూవీ గా రూపొందిస్తున్నాడు. సైరా నరసింహా రెడ్డి మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: